మేష రాశి : ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
వృషభం : ఈరోజు కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలం. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. అత్యుత్సాహానికి పోకుండా, ఆలోచనతో పనులు పూర్తి చేయండి.
మిథునం : ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పై అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు.
కర్కాటకం : ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతు లు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవల్సి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం.
కన్య : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ సంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.
తుల : ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవదర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించటం కానీ చేస్తారు.
వృశ్చికం : ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.
ధనుస్సు : ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
మకరం : ఈరోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాటకారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.
కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలువసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయడం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి,తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.
అత్యాచారం తప్పదనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయటమే… అమితాబ్ వ్యాఖ్యలు వైరల్