telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సాఫ్ట్ వేర్ శారద కథనంపై స్పందించిన సోనూ సూద్

Sonu-Sood

దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో వలసకార్మికులను ఆదుకొని వారికి అండగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూ సూదు దాతృత్వానికి ఎల్లలు లేవని నిరూపితమైంది. ఇవాళ ఓ రైతుకు కొత్త ట్రాక్టర్ బహూకరించి సోనూ సూద్ ఆ కుటుంబానికి చేయూతనిచ్చారు.

తాజాగా వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ శారదపై మీడియాలో కథనానికి ఆయన స్పందించారు. లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ జాబ్ కోల్పోయిన శారద స్వస్థలం చేరుకుని కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న వైనం సోనూ సూద్ ను కదిలించింది. ఈ నేపథ్యంలో మీడియా ద్వారా సాఫ్ట్ వేర్ శారద ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారు. ఆమెతో మాట్లాడతానని ఆమెకు తప్పకుండా సాయం చేస్తానని సోనూ వెల్లడించారు.

Related posts