ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో అనుకున్నట్టే ఆటంకాలు రావటం, ప్రత్యర్థి జట్టుకు లభించడం జరిగింది. దీనితో మొత్తం ప్రపంచ కప్ లో మొదటి స్థానంలో ఉన్న భారత్ ఒక్కసారిగా ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. దీనిపై విమర్శలు తప్పవు మరి, అయినా స్వయానా ప్రధాని కూడా భారత్ ఓటమిపై స్పందించారు.
గెలుపోటములు జీవితంలో భాగం అని, మ్యాచ్ ఫలితం అసంతృప్తి కలిగించినా, టీమిండియా కడవరకు పోరాడిన తీరు అకట్టుకుందని పేర్కొన్నారు. భారత జట్టు ఈ టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించిందని, ఈ విషయంలో మనందరం గర్వించాలని దేశవాసులకు సూచించారు.