మన దేశంలో వీడియో గేమ్ లకు ఎంత పాపులారిటీ ఉందొ అందరికి తెలుసు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు వీడియో గేమ్ ఆడటం మొదలుపెట్టారు. లాక్ డౌన్ సమయంలో ఈ గేమ్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మనదేశంలో వీడియో గేమ్స్ ఆడవారి సంఖ్య గతంలో కంటే మరింత పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది. మనదేశంలో ఏ నగరాల్లో వీడియో గేమ్స్ ను అధికంగా ఆడుతున్నారు అనేది తెలుసా..? ఇండియాలో అహ్మదాబాద్ లో అత్యధికంగా వీడియో గేమ్ ఆడేవారు ఉన్నట్టు తేలింది. ప్రతి 100 మందిలో 71.7 మంది వీడియో గేమ్స్ ఆడతారట. రెండో స్థానంలో 70.1 పాయింట్లతో నవీ ముంబై ఉండగా, 69.8 పాయింట్లతో వడోదర మూడో స్థానంలో ఉన్నది. సూరత్ 68 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, భోపాల్ 67.8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నది. ఇక ముంబాయి 67.8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా, గ్వాలియర్ 67.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఇండోర్ 67.7 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా , థానే 65.7 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రాజ్ కోట్ 64.3 పాయింట్లతో పదోస్థానంలో నిలవడం విశేషం. ఇక హైదరాబాద్ నగరం 63.1 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది.
previous post
జానారెడ్డి పెద్ద కొడుకుగా ఉంటా : రేవంత్ రెడ్డి