telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

రోజాకు మరో కీలక పదవి… ఏ‌పీఐఐసీ చైర్ పర్సన్‌గా.. ఇంకా..

roja

ఏపీసీఎం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏ‌పీఐఐసీ) చైర్ పర్సన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. పలు సమీకరణాల కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమెను ఏఐసీసీ చైర్ పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌లో పనిచేసి కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఏవీ ధర్మారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. టీటీడీ జేఈవోగా తిరిగి రావాలన్న ఆయన కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో కేంద్రం ఆయన డిప్యుటేషన్‌కు అంగీకరించింది. బుధవారమే విధుల నుంచి రిలీవ్ అయిన ధర్మారెడ్డి జేఈవో బాధ్యతలను కూడా నిర్వహిస్తారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related posts