telugu navyamedia
క్రీడలు వార్తలు

తండ్రి కాబోతున్న భారత స్పిన్నర్…

టీమిండియా స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ సతీమణి జూలైలో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టుఅఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. హ‌ర్భ‌జ‌న్-గీతాల కూతురు హినయా హీర్ ప్లహా ఓ టీ షర్ట్ పట్టుకుని.. తాను త్వరలో అక్క‌ను కాబోతున్న‌ట్టు చెప్పింది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 29 అక్టోబర్ 2015న హ‌ర్భ‌జ‌న్ సింగ్, గీతా భ‌స్రా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2016లో ఈ దంప‌తుల‌కు ఓ అమ్మాయి జ‌న్మించింది. ఆమె హినయా హీర్ ప్లహా. ఇప్పుడు జూలైలో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు గీతా ప్ర‌క‌టించారు. గీతా భ‌స్రా బాలీవుడ్‌లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’, ‘సెకండ్ హ్యాండ్ హాడ్సెండ్’ వంటి సినిమాల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. కెరీర్ మంచి ఊపులో ఉండగానే భ‌జ్జీని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న హ‌ర్భ‌జ‌న్ సింగ్.. త్వ‌ర‌లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో సంద‌డి చేయ‌నున్నాడు. ఐపీఎల్ 2021లో కోల్‌తా నైట్ రైడర్స్ త‌ర‌పున భ‌జ్జీ బ‌రిలోకి దిగ‌నున్నాడు.

Related posts