telugu navyamedia
క్రీడలు వార్తలు

గేల్ బ్యాటింగ్ స్థానం పై గంభీర్ అసహనం…

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్‌ కింగ్స్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. కానీ ఆ జట్టు కాంబినేషన్‌పై మాజీ క్రికటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. క్రిస్ గేల్‌కు బదులు టీ20 నంబర్ వన్ ప్లేయర్, ఇంగ్లండ్ హిట్టర్ డేవిమ్ మలాన్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సలహాను గంభీర్ కొట్టిపారేశాడు. ”యూనివర్స్ బాస్, డేవిడ్ మలన్‌కు అస్సలు పోలికే అనవసరమని అభిప్రాయపడ్డాడు. ‘డేవిడ్ మలాన్‌ ప్రపంచ నంబర్‌ 1 టీ20 బ్యాట్స్‌మెన్‌ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో అతనికి పోలికే అనవసరం. మొదట గేల్‌ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపే ఆలోచనను పంజాబ్‌ విరమించుకోవాలి. గేల్‌ తన అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్‌లన్నీ ఓపెనర్‌గా ఆడినవేనన్న విషయాన్ని మరవద్దు. ప్రస్తుత సీజన్‌లో గేల్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా 60కిపైగా బంతుల్ని ఎదుర్కొన్నాడు. అదే ఓపెనర్‌గా ఇన్ని బంతల్ని ఆడి ఉంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడు.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. జట్టులో స్టార్‌ ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ బలహీనమైన మిడిలార్డర్‌ కారణంగా పంజాబ్‌ మ్యాచ్‌లను చేజేతులా చేజార్చుకుంటుందని ఈ బీజేపీ ఎంపీ విశ్లేషించాడు.

Related posts