telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆ విషయంలో అచ్చెన్నాయుడు అందరికీ ఆదర్శం..

vijayasaireddy ycp

అవినీతికి అచ్చెన్నాయుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ… అవినీతి – అక్రమాల్లో  దేవినేని, కొల్లు,ధూళిపాళ్లకు అచ్చెన్నే ఆదర్శమా? టీడీపీ మూసేస్తారని తెలిసి ముందే చక్కబెట్టేసుకుందామనుకున్నారా? రైతులకు చెందాల్సిన లాభాలు ‘దూళి’ పాలు. హెరిటేజ్ తో కుమ్మక్కై “సంగం” భంగం. అరెస్టుపై పచ్చమీడియా గగ్గోలుపెట్టి అక్రమాలపై మౌనమేల? అవినీతి జరిగిన చోట ఏసీబీ దాడులు చేస్తే ఉలికిపాటెందుకు? పాడి రైతులు పైసాపైసా పోగేసి కొన్న డైరీ భూముల్ని అప్పనంగా కొట్టేస్తే చట్టం ఊరుకుంటుందా?” అంటూ విజయసాయి రెడ్డి వెల్లడించారు.  ఇక అంతకుముందు ట్వీట్ లో “గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు మహిళా పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రెండో ఏడాది కూడా డ్వాక్రా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని వారి తరపున సంఘాల ఖాతాల్లో జమ చేశారు అని తెలిపారు.

Related posts