telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ప్రయాణాలు అనుకూలం.. మానసిక ఉల్లాసం…

today rasi falalu

మేషం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. రోజువారీ పనులనుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఎదైనా దూర ప్రదేశానికి కానీ, ఆధ్యాత్మిక కేంద్రానికి కానీ వెళ్లి ప్రశాంతంగా గడపాలి అన్న ఆలోచనను కలిగి ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజు కాదు.

వృషభం : ఈ రోజు ఒక సంఘటన మీ మనసు చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికి లోను కాకుండా మీ పనులు చేసుకోవడం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు.

మిథునం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామికి కానీ, మీరు ప్రేమించిన వ్యక్తిని కానీ మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలదినం.

కర్కాటకం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వివాదాల్లో, కోర్టు కేసుల్లో, పోటీల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు.

సింహం : ఈ రోజు మీరు ఇష్టపడిన వారికి మీ ప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవటానికి అనుకూల దినం. అలాగే మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి అనుకున్న సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యావకాశాలు మెరుగవుతాయి. సంతానం గురించి ఎదురు చూస్తున్నవారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

కన్య : ఈ రోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు.

తుల : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలో మార్పుకానీ, ట్రాన్స్‌ఫర్ కానీ ఉంటుంది.

వృశ్చికం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఎదైనా వస్తువు కొనడం కానీ, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

ధనుస్సు : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూత న వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుం చి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

మకరం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవడం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

కుంభం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతా యి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

మీనం : ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు.

Related posts