telugu navyamedia
క్రీడలు వార్తలు

ఈ ఏడాది టైటిల్ ఆ జట్టుదే అంటున్న గవాస్కర్‌…

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంపై భారత మాజీ కెప్టెన్‌ సునీల్ గవాస్కర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌సీబీ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘విరాట్‌, పడిక్కల్‌ లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కారణంగా రాజస్థాన్‌ బౌలర్లకు బౌలింగ్‌ చేయడం కష్టంగా మారింది. దేవదత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం. వీరిద్దరి కాంబినేషన్‌ బాగుండటం.. కోహ్లి ఓపెనర్‌గా స్థిరపడటానికి ఉపకరిస్తుంది. వీరు చూడముచ్చటైన షాట్లు ఎంచుకోవడంతో పాటు పవర్‌ పుల్‌ షాట్లు ఆడుతున్నారు. ప్లేస్‌మెంట్ కూడా బాగుంది. కొన్ని కష్టమైన బంతులను సైతం ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తున్నారు. వీరిది అసాధారణ ప్రదర్శన.’అని సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. అలాగే ఈసారి టైటిల్ వారిదేనని అంచనావేసాడు. అలాగే పడిక్కల్ ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌, రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. వాటిల్లో భారీ శతకాలు సైతం సాధించాడు. దేశవాళీ టీ20 టోర్నీల్లోనూ గణనీయమైన పరుగులు సాధించాడు. అతను ఏ ఫార్మాట్‌లోనైనా భారత్ తరఫున ఆడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకు అవసరమైన సత్తా అతని దగ్గర ఉంది’అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

Related posts