telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

లవంగాలతో, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే…

లవంగాలు, దాల్చిన చెక్క పొడిని రోజూ అర టీ స్పూన్ ఆహారంలో చేర్చుకుంటే అజీర్తిని దూరం చేసుకోవచ్చు. ఉదర సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. లవంగాలు, దాల్చిన చెక్క, శొంఠి, సోంపు పొడిని ఐదు గ్రాములు తీసుకుని.. ఒక లీటరు నీటిలో మరిగించి.. ఆ నీరు పావు లీటరు చేరాక కషాయంలా తీసుకుంటే జ్వరం, జలుబు నయం అవుతుంది.
ఉదయం, సాయంత్రం పూట రెండు పూటలా ఈ కషాయాన్ని తీసుకుంటే వాత సంబంధిత రోగాలు నయం అవుతాయి. ప్రసవానికి అనంతరం బాలింతకు దాల్చిన చెక్క పొడిని కషాయంలా చేసి తాగిస్తే గర్భసంచి తగ్గి.. పొట్ట పెరగదు. అధిక రక్తస్రావాన్ని కూడా ఈ కషాయం నియంత్రిస్తుంది.
ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఉద‌యం, రాత్రి భోజ‌నానికి అర‌గంట ముందు తాగుతుంటే ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొంత తేనెను క‌లిపి ఆ నీటిని నోటిలో పోసుకుని పుక్కిలిస్తుంటే నోటి దుర్వాస‌న తొలగిపోతుంది.
అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న వారికి తేనె, దాల్చిన చెక్క పొడిల మిశ్ర‌మం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 2 టేబుల్ స్పూన్ల తేనె, 3 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని ఒక గ్లాస్ నీళ్ల‌లో వేసి బాగా క‌లిపి తాగుతుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది. త‌ద్వారా బ‌రువు కూడా త‌గ్గుతారు.

Related posts