telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

*జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడకులు*

*హైదరాబాద్, సెప్టెంబర్ 26:* తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను జిహెచ్ఎంసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వీరనారి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి ప్పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… వీరనారి చాకలి ఐల్లమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. చాకలి ఐలమ్మ అన్ని వర్గాల హక్కుల సాధన కోసము పోరాటం చేసిన దీరవనిత, ప్రజాస్వామ్య వాది అని కమిషనర్ పేర్కొన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా చిట్యాల ఐలమ్మ అందరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అన్నారు.

చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, సరోజ, విజయలక్ష్మి, యాదగిరిరావు, జయరాజ్ కెన్నెడీ, ఎస్టేట్ మేనేజర్ బాషా,యు.సి.డి చంద్రకాంత్ రెడ్డి, సి.పి.ఆర్.ఓ ముర్తుజా, జాయింట్ కమిషనర్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts