telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పార్టీ గెలుపు కోసం వేలిని కోసుకున్న కార్యకర్త…

మన దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండగా అందులో తమిళనాడు కూడా ఉంది. అయితే మరో రెండు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.  నేటితో ప్రచారానికి తెరపడబోతున్నది.  ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుంది.  2011, 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది.  దాదాపుగా 30 ఏళ్ల తరువాత వరసగా రెండోసారి ఒకే పార్టీకి పట్టంగట్టారు.  ఇక ఇదిలా ఉంటె, డీఎంకే అధికారంలోకి వచ్చి పదేళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని గట్టిప్రయత్నం చేస్తున్నది.  డీఎంకే అధికారంలోకి రావాలని కోరుతూ గురవయ్య అనే డీఎంకే కార్యకర్త మరియమ్మన్ ఆలయానికి వెళ్లి తన ఎడమచేతి వేలిని కోసేసుకున్నాడు.  అక్కడ ఉన్న భక్తులు వెంటనే స్పందించి గురవయ్యను ఆసుపత్రికి తరలించారు.  మొదటి నుంచి డీఎంకే పార్టీ అంటే ఇష్టం అని, ఆ పార్టీ కార్యకర్తగా ఉన్నానని, ఈసారి ఎలాగైనా పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ మరియమ్మకు తన వేలిని బలి ఇచ్చినట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ వార్త తెగ హల చల్ అవుతుంది.

Related posts