telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి.. గ్రామ వాలంటీర్లకు బొత్స సూచన

బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామ వాలంటీర్లకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కొత్తగా నియమితులైన గ్రామ వాలంటీర్లను ఉద్దేశిస్తూ మంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని అన్నారు.

గ్రామ వాలంటీర్లు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని… ప్రజా సేవకులని ఆయన చెప్పారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రతి గ్రామ వాలంటీర్ 50 కుటుంబాల చొప్పున బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వాలంటీర్లు విధుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, తప్పులు చేసిన వారిని ఉపేక్షేచించేది లేదని హెచ్చరించారు.

Related posts