telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ మృతి

Dean jones

ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ (59) గుండెపోటుతో మృతి చెందారు. డీన్ జోన్స్ ముంబయిలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ కారిడార్ లో ఇతర సహచరులతో ముచ్చటిస్తున్న ఆయన ఈ రోజు ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే అంబులెన్స్ లో హరికిషన్ దాస్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే జోన్స్ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జోన్స్ మృతి చెందిన సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

ఆస్ట్రేలియాకు చెందిన డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు.ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరుగుతున్నా, ముంబయిలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కామెంట్రీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జోన్స్ స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతల బృందంలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నారు.

డీన్ జోన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 80, 90వ దశకాల్లో అనేక వీరోచిత ఇన్నింగ్స్ లతో ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించారు. 1984లో టెస్ట్ కెరీర్ ఆరంభించిన జోన్స్ 52 మ్యాచ్ లు ఆడి 11 సెంచరీలు, 14 అర్ధసెంచరీలతో 3,631 పరుగులు సాధించాడు. సగటు 46.55. ఇక వన్డేల్లో 164 మ్యాచ్ లు లు ఆడి7 సెంచరీలు, 46 ఫిఫ్టీల సాయంతో 6,068 రన్స్ నమోదు చేశాడు.

Related posts