telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సనత్ నగర్ నియోజక వర్గంలో రూ.1400 కోట్లతో అభివృద్ది: మంత్రి తలసాని వెల్లడి

*పాటి గడ్డలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభం*

సనత్ నగర్ నియోజకవర్గంలో రూ. 1400 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాత్రి బేగంపేట డివిజన్ పాటి గడ్డలో రూ.5.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను మంత్రి ప్రార్భించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ సహకారంతో రూ.1400 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ది పనులను చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.

పాటిగడ్డ ప్రాంతంలో ముస్లింలు, హిందువులు రెండు కళ్ళు లాంటివారని వారందరికీ మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి ఎలాంటి సమస్య లేకుండా చేసినట్లు మంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు. పాటిగడ్డ ప్రాంతంలో నిరుపేదల గృహాలను మరమ్మతులు చేసి ఇస్తామని అందుకు రూ.10 కోట్లు నిధులను వెచిచించనున్నట్లు మంత్రి తలసాని అన్నారు.

ఈ ప్రాంత నాయకులతో ఇళ్లను పరిశీలించినట్లు చేపారు. అట్టి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామన్నారు. ఈ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను నిరుపేదలకు 15వేలకే అందిస్తామని, ప్రయివేట్ ఫంక్షన్ హాళ్లకు 1 లక్ష రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని కానీ 15000 లకే అందజేస్తామని అన్నారు. అందుకు కుర్చీలు, వంట సామాగ్రి పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కేవలం కూరగాయలు బియ్యం నూనెలు తెచ్చుకొని ఫంక్షన్లు జరుపుకోవాలని మంత్రి అన్నారు. పాటిగడ్డలో స్థల ప్రభావం వలన ఫంక్షన్ హాలు సకాలంలో నిర్మించుకోలేకపోయామని స్థలం ఆర్ అండ్ బి నుండి రోడ్లు భవనాల శాఖ జిహెచ్ఎంసికి మార్పు చేయడం కోసం ముఖ్యమంత్రిని కోరగానే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారని అందుకు నిధులను కేటీఆర్ ను అడగాలని మంజూరు చేశారని జిహెచ్ఎంసి ద్వారా తక్కువ కాలంలో ఫంక్షన్ హాల్ నిర్మించి ఇచ్చినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

జూబ్లీహిల్స్ ఐటి ప్రాంతంలో సిసి రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ పేదల నివసించే కాలనీలో కూడా సిసి రోడ్లు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని, ఒక యాభై ఏళ్లల్లో జరగని అభివృద్ధి 9 నెలల జరిగిందని బీదలు ధైర్యంగా బతకాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అందుకు కేసిఆర్ పేదల పక్షపాతం అయినందున పేదలు ఆడపిల్లలకు వివాహం కోసం తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదని ఉద్దేశ్యంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయంతో పెళ్లి ఫంక్షన్ కేసిఆర్ గారే చేస్తున్నారని అన్నారు. ఈ ఫంక్షన్ హాల్ 17మీటర్ల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది ఒకటవ అంతస్తులో భోజన వసతి రెండో అంతస్తులు పెళ్లి కార్యక్రమాలు గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఎస్సీ అనిల్ రాజ్, డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

 

Related posts