telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్ నిర్లక్ష్యం: జో బైడెన్

Joe Biden USA

క‌రోనా వైర‌స్ కరోనాను కట్టడి చేయడంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని అధ్య‌క్ష ఎన్నిక‌ల డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా తాజాగా మిచిగాన్ లోని వారెన్ న‌గ‌రంలో జో బైడెన్ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడుతూ ట్రంప్ తీరుపై మండిప‌డ్డారు.

అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ట్రంప్ త‌ల‌కిందులు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. మార్చి, ఏప్రిల్ లో ల‌క్ష‌లాది మంది ఉద్యోగులు లేఆఫ్ ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని, వారిలో దాదాపు స‌గం మంది పూర్తిగా ఉద్యోగాల‌ను కోల్పోయార‌ని జో బైడెన్ విమర్శించారు.ఈ ప‌రిస్థితుల‌న్నీ ట్రంప్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే వాటిల్లాయ‌ని, ఆయ‌న అమెరికా అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగడానికి అనర్హుడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

Related posts