telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బయల్దేరిన రైలు… ఇరుక్కున్న వేలు…

Train
శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఎంబార్కాడెరో రైల్వే స్టేషన్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రైలు ఎక్కబోతుండగా అకస్మాత్తుగా తలుపులు మూసుకుపోయాయి. దీంతో ఆ మధ్యవయస్కురాలు చేయి రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోయింది. తన చేయి ఇరుక్కుపోయిందని ఆమె కేకలు వేస్తుండగానే నెమ్మదిగా రైలు బయలుదేరింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె… మరింత పెద్దగా కేకలు వేస్తూ రైలుతో పాటు పరిగెత్తబోయింది. అయితే అది వేగం పుంజుకోవడంతో  రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య సందులో పడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఆమె ప్రాణానికి ఎటువంటి హానీ జరగలేదు. అయితే ఈ ఘటనలో తీవ్రమైన గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామని తెలిపారు అధికారులు. 

Related posts