telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబును కట్టప్పతో పోల్చేసిన బీజేపీ..

తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఇవాళ బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ ధియోదర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ ధియోదర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైసీపీ, టీడీపీల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్రంలో ఉన్న తమ పార్టీ బీజేపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ ధియోదర్‌. చంద్రబాబు నాయుడు సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. అంతేకాదు.. బాహుబలి ఎన్టీఆర్ అయితే కట్టప్ప చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే… అధికారంలోకి వచ్చాడని ఫైర్‌ అయ్యారు. ఏపీలో వారసత్వ రాజకీయాలున్నాయని… బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

Related posts