telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో కూడా వ్యాక్సిన్ ఫ్రీ… ప్రకటించిన కేసీఆర్

oxygen sylender

కరోనా రోగులకు ఇచ్చే వైద్యంలో ఆక్సిజన్ చాలా ముఖ్యం కావడంతో దేశ వ్యాప్తంగా దాని కొరత ఏర్పడింది. అయితే ప్రస్తుతం రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.  ఢిల్లీలో ఆక్సిజన్ కొరత పెద్ద ఎత్తున ఉన్నది.  ఆక్సిజన్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రతి రోజు ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో మరణిస్తున్నారు.  ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న ఉత్తర ప్రదేశ్ లోని ఇందిరాపురం లో ఉన్న ఓ గురుద్వారా ఆక్సిజన్ లాంగర్ పేరుతో ఓ పథకాన్ని ఏర్పాటు చేసింది.  ఆక్సిజన్ అవసరమైన వ్యక్తులు అక్కడికి వచ్చి ఆక్సిజన్ ను తీసుకోవచ్చు.  దీనికోసం ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు.  దీంతో ఆక్సిజన్ కోసం గురుద్వారాకు వచ్చే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్ల కోసం గురుద్వారా ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

Related posts