telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మీడియా ముందు ఏడ్చేసిన తెలంగాణ మంత్రి…

గత రాత్రిఉగ్రవాదులకు ,జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించే సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాన్ ఒకరు, అలానే ఆంద్ర ప్రదేశ్ కు చెందిన జవాన్ ఒకరు వీర మరణం పొందారు. తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా కోమన్ పల్లికి చెందిన ర్యాడ మహేష్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే..నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జవాన్‌ ర్యాడ మహేష్‌ మృతికి తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…కన్నీళ్లు పెట్టుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్ కు చిన్న తనం నుంచే అమితమైన దేశభక్తి ఉందని… దేశం మీద ప్రేమతో సైన్యం లో చేరి భారతావని కోసం మహేష్‌ చేసిన త్యాగం మరువలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వేల్పూర్ వాసిగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మీడియా ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి.

Related posts