telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ద్రాక్షతో.. ఆరోగ్యరహస్యాలు..

grapes for health for all

ఆరోగ్యం కోసం పలురకాల పండ్లు తీసుకుంటుంటాం.. అందులో కొన్నిటిలో పలు ప్రయోజనాలు ఉంటాయి. ఆ తరహా పండ్లు తరచుగా అంటే ఆయా సీజన్ లలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ జాతికి చెందిన వాటిలో ద్రాక్ష ప్రధానంగా చెప్పుకోవాలి. ఇవి కూడా మార్కెట్ లో పలురకాలు దొరుకుతున్నాయి. అందులో నచ్చినవి రోజు గుప్పెడు తింటే, ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేమో తెలుసుకుందాం..

* ద్రాక్ష‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటాయి.

* నిత్యం ద్రాక్ష‌ల‌ను తింటుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ద్రాక్ష‌ల్లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. అలాగే శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

* ద్రాక్ష‌ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు రాద‌ని, జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అలాగే ద్రాక్ష‌ల‌తో కంటి చూపు కూడా మెరుగు ప‌డుతుంది.

* కీళ్ల నొప్పులు ఉన్న వారు ద్రాక్ష‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Related posts