ఏపీ లోని కృష్ణా జిల్లా వేదాద్రి సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులలో ముగ్గురు తప్ప మిగిలినవారందరూ తెలంగాణవాసులుగా గుర్తించారు. ఘటన జరిగింది ఏపీలో కావడంతో సీఎం జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించారు.
తెలంగాణ వారికీ వర్తించేలా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని సీఎంవో వెల్లడించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఓ ట్వీట్ లో తెలిపింది. అటు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఏపీకి చెందిన ముగ్గురికి కూడా నష్టపరిహారం వర్తిస్తుందని తెలిపారు.