telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్రంప్ చైనాతో తెరవెనుక వ్యాపారాలు: కేఏ పాల్

KA-Paul

ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ స్పందించారు. .చైనాకు బుద్ధి చెప్పే నేత ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేకపోవడమే అనేక సమస్యలకు కారణమవుతోందని అన్నారు. చైనాకు శాంతి అక్కర్లేదని, వాళ్లు యుద్ధాన్నే కోరుకుంటారని వ్యాఖ్యానించారు.కరోనా వైరస్ గురించి ఎంతో ముందుగా తానే వెల్లడించానని అన్నారు.

వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ను ఉద్దేశపూర్వకంగా పంపించారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి సరిగా లేదని అన్నారు. ట్రంప్ చైనాతో తెరవెనుక వ్యాపారాలు చేస్తున్నాడని ఆరోపించారు. చైనా సహాయం కోరుతున్నాడని తాను ఎప్పట్నించో చెబుతున్నానని పేర్కొన్నారు. ఆ విషయాన్నే తాజాగా అమెరికాలో ప్రముఖ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొందని కేఏ పాల్ వెల్లడించారు.

Related posts