telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నాణ్యత లేమికి చిరునామా… చైనా వస్తువులు!

నాణ్యత లేమికి చిరునామా…

చైనాతయారీ వస్తువులు!

కానీ….

కల్లోలానికి కారణమైన కరోనాను

కడునాణ్యంగా సృష్టించి

లోకం మీదికి వదిలిన చైనా…

అదే కరోనాపై.. కాసులుగడి స్తోంది!

విలయంలో కూడా వ్యాపారం చేస్తోంది!

విపత్తులో కూడా లాభం కోసం చూ స్తోంది!

 

అల్లకల్లోల సమయంలో…. 

అందరికీ కావలసిన వస్తువులను

అవసరమైన వస్తువులను

అధికంగా తయారుచేస్తూ

ఆందోళనలో ఉన్న దేశాలకు

అమ్మకాలు జరుపుతూ

లాభాలు గడిస్తోంది!

 

కరోనాను ఎదుర్కొనటానికి

దేశాలకు అప్పు ఇచ్చి

వడ్డీ వసూలు చే స్తోంది!

 

నాసిరకం కరోనా నిర్ధారణ కిట్లు

ఇతర దేశాలకు పంపి

సొమ్ములు చేసుకుంటోంది!

 

వెంటిలేటర్లు వగైరాలు

విపరీతంగా ఎగుమతి చేస్తూ

లాభాలు గడిస్తోంది !

 

నాణ్యతలేకుండా నిర్మించిన 

ప్రాణవాయువు పరికరాలు 

మనదేశానికి పంపిస్తూ

ప్రజలప్రాణాలు 

ప్రమాదంలో నెడుతోంది!

అవసరమైన మందులను 

అధికధరలకు అమ్ముతోంది !

 

కరోనా మూలంగా

చైనా దేశంలోని

విదేశాల కంపెనీలు

మూతపడుతుంటే

ఉప్పుకు.. ఉరగాయకు

మూకుమ్మడిగా కొనే స్తోంది!

 

శవాలు మీద పేలాలు ఏరుకున్నట్లు

సమస్యలో కూడా….

సొమ్ములు చేసుకుంటున్న చైనా

విలయంలో కూడా….

విత్తంఏరుకుంటున్న చైనా 

ప్రళయంలో కూడా….

పైసలు పోగేస్తున్న చైనా

మహమ్మారిపై పోరాటంలో 

మునిగి ఉన్న దేశాలపై

దురాక్రమణలు చేస్తున్న చైనా

మనపొరుగుదేశంగా ఉండడం… 

మన దురదృష్టం!

ప్రపంచదేశంగా ఉండడం… 

ప్రజలు చేసుకున్న పాపం!

Related posts