telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్ కోసం డిజిటల్‌ క్యాంపెయిన్‌..

విశాఖ స్టీల్‌ ప్లాంట్ పై జనసేనపార్టీ నిర్ణయించింది. ఈ మేర‌కు రేపట్నుంచి మూడు రోజుల పాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం డిజిటల్‌ క్యాంపెయిన్‌ మొదలు పెడుతున్నామ‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వెల్ల‌డించారు. రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని వైసీపీ స‌ర్కార్ ప్ర‌శ్నించాల‌ని.. కేంద్రాన్ని అడగకుంటే తప్పు చేసినట్టు అవుతుందని పవన్‌ కళ్యాణ్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ… విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్ల‌మెంటులో ఎందుకు మాట్లాడ‌టం లేదని ఫైర్ అయ్యారు. మాట్లాడితే క‌దా కేంద్రానికి మ‌న స‌మ‌స్య అర్ధ‌మ‌వుతుంద‌ని అన్నారు.

ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానిదే బాధ్యత.. మనమేం చేయనక్కర్లేదనే ధోరణితో వైసీపీ ఉందన్నారు.వైఎస్ ఆర్ సీపీకి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతోనే ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టామ‌ని అన్నారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం అన్నీ రాజ‌కీయ పార్టీలు ప‌క్క‌న పెట్టి ప్రతి ఒక్కరు ఒకే తాటిపై న‌డిచే సమయం ఆసన్నమైందని జ‌న‌సేన అధినేత అన్నారు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విబేధాలు ఉన్నా ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజాసేవే. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం” అని పవన్ కల్యాణ్ గుర్తుచేసారు. 

Related posts