telugu navyamedia
క్రైమ్ వార్తలు

జాతీయ యువ మహిళా షూటర్ కోనికా లాయక్ సుసైడ్

జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా హౌరా జిల్లాలోని బల్లిలోని తాను ఉంటున్నహాస్టల్‌లో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

National level shooter Konika Layak ends life - Telegraph India

పోలీసుల‌ స‌మాచారం ప్రకారం..

ఆమె వద్ద ఒక సూసైడ్ నోట్ దొరికింద‌ని, అందులో ఆత్మ‌హ‌త్య‌కు “డిప్రెషన్” కారణమని, అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఆమె నిరాశ‌కు లోనైంద‌ని ..ఆమె సూసైడ్‌ నోట్‌లో రాసిన‌ట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కోనికా కోల్‌కతాలో మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్ వద్ద శిక్షణ పొందుతోంది. ఇలా అక‌స్మాత్తుగా ఆమె హాస్ట‌ల్ గ‌దిలో ఉరేసుకుని క‌నిపించ‌డంతో ఆ ప్రాంతమంతా క‌ల‌క‌లం రేపింది.

కాగా..కోనికా లాయక్ జనవరిలో సోనూ సూద్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్‌ చేసింది. అందులో.. 11వ జార్ఖండ్ స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేను రజతం, బంగారు పతకం సాధించాను. అయితే, ప్రభుత్వం నుంచి నాకు ఏమాత్రం సహాయం లేదు. దయచేసి సహాయం చేయండని ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌కు స్పందించిన సోనూ సూద్ 2021 ప్రారంభంలో జర్మన్-తయారీ చేసిన రైఫిల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ రైఫిల్‌తో ఆమె నేషనల్స్ తో పాటు ఇతర పోటీలలో పాల్గొనవచ్చు.

Sonu Sood gifts imported rifle to Jharkhand shooter, then won the hearts of fans - The Post Reader

“సోనూ సూద్ సార్, నాకు రైఫిల్ అందింది.. నా కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది. మా గ్రామం మొత్తం మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీరు చిరకాలం జీవించండి” అని కోవిడ్ -19 మహమ్మారి మధ్య తుపాకీని అందుకున్న తరువాత ఉల్లాసంగా ఉన్న లాయక్ ట్వీట్ చేసింది.

Related posts