telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీసీఎం .. బీజేపీ అధ్యక్షుడితో భేటీ.. ప్రత్యేక హోదాయే ఎజండా.. !

apcm met amit sha in delhi today

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. జగన్‌ వెంట వైకాపా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి, రఘురామకృష్ణం రాజు, అవినాశ్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలోని అంశాలను ఆయనకు వివరించినట్టు తెలిపారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలుపుతూ ఓ లేఖను అమిత్‌షాకు అందజేశామని వెల్లడించారు. శనివారం జరగబోయే నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతానని సీఎం స్పష్టంచేశారు.

నేడు హస్తినలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు. రేపు వైకాపా పార్లమెటరీ పార్టీ భేటీలో పాల్గొననున్న సీఎం.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. నీతిఆయోగ్‌ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంపై వివరించేందుకు ఇప్పటికే నివేదిక సిద్ధం చేయించిన జగన్‌.. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై మాట్లాడనున్నారు.

Related posts