telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ‌లో స్కూళ్ల వేస‌వి సెల‌వులు పొడిగింపు

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. తెలంగాణ సర్కార్ ఎంత కటిన నిర్ణయాలు తీసుకున్న కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ వైరస్ పిల్లలపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల వేసవి సెలవులను పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20 వరకు వేసవి సెలవులను పెంచుతున్నట్లు  ఉత్తర్వులలో పేర్కొంది ప్రభుత్వం. అటు రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు కూడా తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఎడ్ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం… లా- సెట్ దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పొడిగించింది. అలాగే పిఈ సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Related posts