telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం : స‌ర్పంచ్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ‌ వేత‌నం పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని   స‌ర్పంచ్‌లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌర‌వ వేత‌నాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్‌/స‌హాయ‌కులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్‌, విలేజ్ ఆర్గ‌నైజేష‌న్ అసిస్టెంట్‌, ఆశా వ‌ర్కర్స్‌, సెర్ప్ ఉద్యోగుల జీతాల‌ను 30 శాతం పెంచుతూ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. అలాగే కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కూలీలకు రోజు వారి కనీస వేతనాన్ని రూ. 300 నుంచి ఏకంగా రూ. 390 కు పెంచింది. అలాగే కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8000 నుంచి 10,400 పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అటు పార్ట్ టైం వర్కర్ల వేతనాలు కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పార్ట్ టైం వర్కర్ల వేతనం నెలకు 4 వేల నుంచి రూ. 5200 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన వేతనాలను జూన్ 1 నుంచి అమలు అవుతాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

 

Related posts