telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వాట్సాప్, ఫేస్‌బుక్‌ను ఉద్దేశించి సుప్రీం కామెంట్లు…

court

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రస్తుతం చర్చముషానియంగా మారింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. “మీది 2 నుంచి 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు.. కానీ, భారత దేశ ప్రజలకు గోప్యత అనేది అన్నింటికంటే చాలా విలువైనది. వారి గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది” అంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌ను ఉద్దేశించి కామెంట్లు చేసింది.. ఇక, కొత్త ప్రైవసీ పాలసీపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు.. వాట్సాప్ ప్రైవసీ పాలసీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ  ఇవ్వాలని పేర్కొంది.. తమ నోటీసులకు 4 వారాల్లోగా సమాధానం తెలియజేయాలని ఫేస్‌బుక్, వాట్సాప్‌కు స్పష్టం చేశారు జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఇక వాట్సాప్ తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్.. కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల సమాచారం బయటకు పోతుందన్న వాదన సరికాదన్నారు. ప్రైవసీపై యూరప్‌లో ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టానే తీసుకు వస్తే దానినే అనుసరించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కాగా, జనవరి 8 వాట్సాప్ తన సేవా నిబంధనలను మరియు గోప్యతా విధానాన్ని పునరుద్ధరించింది. అవి ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం, వినియోగదారులు ఫేస్‌బుక్‌తో వ్యాపార సంభాషణలను కలిగి ఉన్న దాని కొత్త డేటా షేరింగ్ నిబంధనలను అంగీకరించాలి. దీంతో.. వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. దాని గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. చాలా మంది వాట్సాప్, ఫేస్‌బుక్‌కు గుడ్‌బై చెప్పడం కూడా ప్రారంభించారు.

Related posts