telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆచార్య’లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు…

chiru

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆచార్య’ సినిమాపై మరో వార్త పుట్టుకొచ్చింది. తాజాగా ఇప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్నట్లుగా వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ సినిమాలో మోహన్ బాబు కోసం ఓ నెగిటివ్ రోల్‌ని కొరటాల ప్రిపేర్ చేస్తున్నాడని, అదీ కూడా చిరంజీవి కోరిక మేరకు అని అంటున్నారు. ఈ మధ్య చిరంజీవి, మోహన్ బాబుల మధ్య బంధం ఎంత ధృడంగా తయారైందో తెలియంది కాదు. చిరు, మోహన్ బాబు‌లు మరొక్కసారి కలిసి నటిస్తున్నారంటే మాత్రం ‘ఆచార్య’పై క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం. ఎందుకంటే వారిద్దరూ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి ఉన్నారు. వాస్తవానికి మోహన్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నాడంటూ ఆ మధ్య మోహన్ బాబు పిక్ ఒకటి విడుదలైనప్పుడు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చేవరకు కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related posts