అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్ దేశస్థుడేనని చెప్పుకొచ్చారు. నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఖండించారు. అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్ ప్రధానికి లేదని మండిపడ్డారు. రాముని జన్మస్థలం ముమ్మాటికీ అయోధ్యనే అని తేల్చిచెప్పారు.
చైనా మెప్పుకోసం నేపాల్ ప్రధాని లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. నేపాల్‌లో ఉన్న అనేక హిందు దేవాలయాలను పునరుద్ధరించాలన్నారు. భారత్‌లో అనేకమంది నేపాల్ దేశస్తులు జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు నేపాల్‌కు భారత్ అండగా ఉండడంతోనే చైనా నేపాల్‌ను ఆక్రమించలేదని అన్నారు.
కాంగ్రెస్ ఓటమి పాలైతే నాదే బాధ్యత: సీఎం అమరీందర్