telugu navyamedia
క్రీడలు వార్తలు

అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తిసారా పెరీరా…

శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్‌ తిసారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ అవుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ కు ఈరోజు ఉదయం తెలియజేశాడు. గురువారం లంక సెలక్టర్లు సమావేశం కానుండగా ఈలోపే తిసారా తన నిర్ణయాన్ని తెలిపాడు. శ్రీలంక తరఫున తిసారా పెరీరా 6 టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 6 టెస్టుల్లో 203 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అంతగా రాణించని పెరీరా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో మాత్రం తనదైన ముద్ర వేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన పెరీరా 166 వన్డేలలో 2338 పరుగులు చేశాడు. 175 వికెట్లు కూడా తీశాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో 1204 పరుగులు, 51 వికెట్లు పడగొట్టాడు. లంక జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో కూడా మెరుపు బ్యాటింగ్ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంక అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పెరీరా గుర్తింపుతెచ్చుకున్నాడు.

Related posts