తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7432 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక 33 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 2157 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 387106 కు చేరగా.. రికవరీ కేసులు 3,26,997 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1961 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 83.16 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 86.5 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, నిన్న ఒకే రోజు 103770 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 1,23,84,797 కు చేరుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
previous post
అందుకే ఆర్ఆర్ఆర్ కోసం ఆ హీరోను తీసుకున్నా… రాజమౌళి