గత నెలరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బురారీ ప్రాంతంలో 450 పడకలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మరణాల సంఖ్య, పాజిటివిటీ రేటు కూడా బాగా తగ్గాయన్నారు.
వైరస్ బారి నుంచి రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీ ప్రజలు, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి సమిష్టిగా విజయం సాధించామని ఆయన తెలిపారు. అయితే, కరోనాపై పోరు అప్పుడే ముగిసిపోలేదని కేజ్రివాల్ పేర్కొన్నారు శుక్రవారం నాటికి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.28 లక్షలకు చేరింది.
అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స