యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి రైల్వే స్టేషన్ గా మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లోని ఈ స్టేషన్ పేరు మార్చుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకొంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తయితే, దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో స్టేషన్ అభివృద్ధికి, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.