రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్ స్పీడ్తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఉత్తర మెక్సికో సరిహద్దు ప్రాంతంలో ఘోరం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు బకదానినొకటి ఢీకొట్టడంతో.. అక్కడిక్కడే 16 మంది గని కార్మికులు మరణించారు. మెక్సికోలోని సోనోరాలో జరిగిన ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున నోషీ బ్యుయెనా గనికి చెందిన కార్మికులను తరలిస్తుండగా రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులు ఘోరంగా దెబ్బతిన్నాయి. రెండు బస్సులు అతివేగంగా రావడం కారణంగానే… ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. మృతి చెందిన వారు ఆ బస్సులోనే చిక్కుకుపోయారు. ఆ మృతదేహాలను బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రలును సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు అధికారులు. ఈ ప్రమాదంతో రహదారిపై కొంత ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.