telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా..షెడ్యూల్ ప్రకారమే ఇంజనీరింగ్ పరీక్ష..

తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌, అగ్రికల్చర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షలను ఉన్నత విద్యామండలి బుధవారం వెల్లడించింది.వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

భారీ వర్షాల నేపథ్యంలో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్నిచోట్ల రహదారులు తెగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో బుధ, గురు వారాల్లో కూడా వర్షాలు కురిస్తే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఎగ్జామ్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తారా అనే దానిపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. 

అయితే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు.. షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్‌ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

 

Related posts