telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

పెట్టుబడి దాటేసిన .. సాహో .. ఇక అంతా లాభాలే..

saaho

తొలి వారాంతంలో ‘సాహో’ సత్తా చాటుకుంది. వినాయకచవితి సెలవు కలిసి రావడం కూడా ఈ చిత్రానికి దోహదపడింది. సోమవారం నాడు మూడు వందల కోట్ల గ్రాస్‌ మార్కుని దాటేసిన సాహో ప్రస్తుతం ఆల్‌టైమ్‌ హయ్యస్ట్‌ గ్రాసింగ్‌ సౌత్‌ సినిమాలలో ఆరవ స్థానంలో వుంది. ఈ ఆరు చిత్రాల్లో మూడు ప్రభాస్‌ సినిమాలు వుండడం గమనార్హం. సాహో తెలంగాణలో స్ట్రాంగ్‌గా రన్‌ అవుతూ వుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అండర్‌ పర్‌ఫార్మ్‌ చేస్తోంది. అయితే ఈ లోటుని హిందీ కలక్షన్లు భర్తీ చేసాయి. హిందీ వెర్షన్‌కి నాలుగు రోజుల్లోనే రమారమి వంద కోట్ల నెట్‌ వసూళ్లు రావడం అక్కడి ట్రేడ్‌ పండితులని కూడా విస్మయ పరచింది. ఇటీవల షారుక్‌ ఖాన్‌ సినిమాలకి కూడా వంద కోట్ల నెట్‌ వసూళ్లు రావట్లేదు.

హిట్‌ టాక్‌ వస్తే తప్ప అక్షయ్‌కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ల సినిమాలు ఆ మార్కు దాటట్లేదు. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలకి మాత్రమే తొలి వారాంతంలో వంద కోట్ల నెట్‌ వసూళ్లు వస్తుంటాయి. టాక్‌తో సంబంధం లేకుండా ఒక సౌత్‌ హీరో సినిమాకి ఈ క్రేజ్‌ ఏమిటనేది అక్కడి ట్రేడ్‌ పండితులకే అంతు చిక్కడం లేదు. తొలి నాలుగు రోజుల పాటు వసూళ్లు బాగుంటాయనేది ముందే అంచనా వేసినా కానీ టాక్‌ బ్యాడ్‌గా వచ్చినా కానీ ఇంత వసూళ్లు రాబట్టడం మాత్రం భారీ అఛీవ్‌మెంటు. బాహుబలి సమయంలో జరిగినట్టు గానే సాహో సినిమా కి కూడా తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక్కటిగా నిలబడి దాని కలెక్షన్లు పెంచడం కోసం కృషిచేశారు. ఇలాగే కొనసాగితే తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఎంతో దూరంలో లేదు. అన్ని టాలీవుడ్ సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Related posts