telugu navyamedia
వార్తలు సామాజిక

శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించవద్దు: కేంద్ర ఆరోగ్య శాఖ

sanitizer mask corona

కరోనా వైరస్ నివారణ కోసం చాలామంది శానిటైజర్లు, మాస్కులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చేతులను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించే శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్కులు ధరించండని సూచింది.

తరచుగా వేడినీళ్లు తాగుతుండండి. శుభ్రంగా చేతులు కడుక్కోండి. శానిటైజర్లను మాత్రం అతిగా ఉపయోగించవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ స్పష్టం చేశారు. గతంలో కూడా శానిటైజర్లపై ఆరోగ్య నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. శానిటైజర్లను అతిగా వినియోగించడం వల్ల చర్మాన్ని కాపాడే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుందని తెలిపారు.

Related posts