telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ మహిళా మంత్రికి కరోనా పాజిటివ్…

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. మన తెలంగాణలో కూడా ఈరోజు వచ్చిన కరోనా బులిటెన్ తో కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రముఖులు కరోనా బారినపడ్డారు.. తిరిగి కోలుకున్నారు. అయితే, తాజాగా రాష్ర్ట మ‌హిళా, శిశు సంక్షేమ‌, గిరిజన అభివృద్ధిశాఖ మంత్రి స‌త్యవ‌తి రాథోడ్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది.. జ్వరంతో బాధపడుతోన్న ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇవాళ ఉదయం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.. ఈ పరీక్షల్లో ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. ఇక, వైద్యుల సూచనలతో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న ఆమె.. ఆ తర్వాత యశోద ఆస్పత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. అయితే గత వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆవిడ కోరినట్లు తెలుస్తుంది.

Related posts