telugu navyamedia
వార్తలు సామాజిక

రెండు పొరల మాస్కులనే వినియోగించాలి!

masks corona

కరోనా వైరస్ నివారణ కోసం చాలామంది శానిటైజర్లు, మాస్కులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లోఎక్కువ మంది తమ ఇండ్లలోనే బట్టతో సొంతంగా మాస్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మాస్కులకు కనీసం రెండు పొరలు ఉండాల్సిందేనని తాజాగా చేపట్టిన అధ్యయనం ఒకటి వెల్లడించింది. ముఖకవచానికిమూడు పొరలుంటే మరింత మంచిదని తెలిపింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ యూనివర్సిటీ పరిశోధకులతో కూడిన బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది.

కరోనా బాధితులు నుంచి వచ్చే తుంపర్లలో వైరస్‌ వెలువడుతుంది. ఇండ్లలో తయారు చేసుకునే ముఖకవచాలు ఈ తుంపర్లను ఎంతమేరకు అడ్డుకోగలుగుతున్నాయనే అంశాన్ని సర్జికల్‌ మాస్కులు సమర్థతతో శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో పోల్చి చూశారు. పరిశోధనలో భాగంగా ఎల్‌ఈడీ కాంతి వ్యవస్థ, హై స్పీడ్‌ కెమెరాతో తుంపర్ల వెలువడే విధానాన్ని పరిశీలించారు. తుంపర్లను సర్జికల్‌ మాస్కులు ఎంతో సమర్థవంతంగా అడ్డుకుంటున్నయని నిరుపించారు.

Related posts