telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy

తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. కార్మికులు ఈనెల 5 లోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ విధించిన గడువు నేటితో ముగియనుంది. సమ్మె ను విరమించి నేటి అర్ధ రాత్రి లోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యల పై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టులనే ధిక్కరించిన ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రెవెన్యూ అధికారులను విలన్లుగా చిత్రీకరించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్యకు కేసీఆర్ వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు.

Related posts