ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఇంకా గొడవలు సద్దుమనుగలేదు. మరోసారి వైసీపీ-టీడీపీ కార్యకర్తల దాడులతో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్లు రువ్వుకుని డ్రింక్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు ఈ దాడులలో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తకు చెందిన టైల్స్ షాప్ అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి టీడీపీ-వైసీపీ పార్టీలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని సామర్లకోట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకుని వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.వైసీపీ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్ వినోద్‌కు తల చేతులపై తీవ్ర గాయలవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.