telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఓటర్ ఐడీకి ఆధార్ లింక్…

వీలైనంత త్వరగా ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నిలోక్ ‌సభలో వెల్లడించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇకపై ఓటర్ ఐడీకి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు.. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి.. ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో కూడా తెలుసుకునే వీలు ఉంటుందన్నారు.  కాగా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.. మరోవైపు.. తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.. ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్‌ కార్డులను ఈసీ నియంత్రించలేకపోతోంది. అయితే, బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇక ఈరోజు కేంద్రమంత్రి ప్రకటనను తర్వాత ఆ వైపుగా కేంద్రం దృష్టి సారించిందని అర్ధమవుతుంది.

Related posts