telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కలకత్తా సీపీపై .. బదిలీ వేటు..అనుజ్ శర్మకు బాధ్యతలు..

kolkata cp rajeev transferd

పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను బదిలీ చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) ఏడీజీ అండ్ ఐజీపీగా మమతా సర్కార్ పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్‌ పోలీస్‌(శాంతి భద్రతలు)గా విధులు నిర్వర్తిస్తున్న అనుజ్ శర్మను కలకత్తా పోలీస్ కమిషనర్‌గా నియమించింది. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అనుజ్ మంగళవారం సీపీగా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులను బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో అధికారులను ట్రాన్స్‌ఫర్ చేశారు.

2016 మేలో రాజీవ్ కుమార్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. శారద చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న కలకత్తా సీపీ రాజీవ్ కుమార్ ఈ కేసులోని ఆధారాలు మాయం చేశారంటూ సీబీఐ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సీపీని ప్రశ్నించేందుకు ఆదివారం 40 మందికి పైగా సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లడంతో స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో పశ్చిమబెంగాల్ పోలీసులకు, సీబీఐ అధికారులకు మధ్య వివాదం చోటుచేసుకుంది.

Related posts