మూడు రాజధానుల గెజిట్‌ను నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ వేసింది. వీటి అమలుపై పిటిషనర్ స్టే కోరారు. రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, విభాగాధిపతులు, సచివాలయం అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి పిటిషనర్ ఆదేశాలు ఇవ్వాలన్నారు. జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలని పిటిషనర్ కోరారు. దీనిని హైకోర్టు ధర్మాసనం రేపు విచారించనుంది
previous post
next post