telugu navyamedia
రాజకీయ వార్తలు

షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత..

Supreme Court

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తోంది. షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీపై స్పష్టత లేదని, విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు.

మతపరమైన అంశాల్లో కోర్టు జోక్యం సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. మసీద్‌ కింద ఆలయ అవశేషాలు ఉన్నట్లు ఏఎస్‌ఐ గుర్తించిందన్నారు. తద్వారా రామాలయం ఉన్నట్లు పరోక్షంగా కోర్టు ధృవీకరించినట్లైంది. ఈ క్రమంలో షియా వక్ఫ్ బోర్డు, అఖాడా వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Related posts