telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ, స్మిత్ లను అధిగమించానంటే ఆశ్చర్యంగా ఉంది : కేన్

2020 ఏడాది చివర్లో ఐసీసీ టెస్ట్ నెంబర్ 1 బ్యాట్సమెన్ గా అవతరించాడు కేన్ విలియమ్సన్. డిసెంబర్ 31 న ప్రకటించిన ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో, కేన్ విలియమ్సన్ 2015 తర్వాత మళ్ళీ మొదటిసారిగా నంబర్ 1 ర్యాంకును సాధించాడు. అయితే మొదటమ్ మూడో స్థానంలో ఉన్న కేన్ పాక్ పై బాదిన సెంచరీతో మొదటి స్థానానికి చేరుకోగా కోహ్లీ తన రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. కానీ స్మిత్ మాత్రం భారత్ పై పేలవ ప్రదర్శన చేయడంతో మూడో స్థానానికి పడిపోయాడు. ఈ సందర్బంగా ఐసీసీ విలియమ్సన్ మాట్లాడుతూ… టెస్టుల్లో అగ్రస్థానానికి చేరడం పై థానే ఆశ్చర్యపోతున్నానని చెప్పిన కేన్… కోహ్లీ, స్మిత్ లను అధిగమించడం నేను గౌరవంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ అన్ని ఫార్మాట్లలో విజయాన్ని సాధించడంలో సహాయపడటం న బాధ్యత. అలా జట్టుకు ఆడుతుంటే వ్యక్తిగత రికార్డులు అవే వస్తాయి… అని పేర్కొన్నాడు. విలియమ్సన్ ఆధ్వర్యంలో, న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన సంవత్సరాన్ని సాధించింది, వారి 6 టెస్టుల్లో 5 గెలిచింది. బ్లాక్‌క్యాప్స్ భారతదేశాన్ని 2-0తో స్వీప్ చేసింది, ఆ తర్వాత వారు వెస్టిండీస్‌ను 2-0తో ఓడించారు. పాకిస్థాన్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో న్యూజిలాండ్ చివరి సెషన్ థ్రిల్లర్‌ను కైవసం చేసుకుంది.

Related posts